HomeTelugu Trendingమరో రీమేక్ మూవీతో వెంకటేష్

మరో రీమేక్ మూవీతో వెంకటేష్

7 12
ఎఫ్‌2, వెంకీమామ సినిమాల విజయాలతో మంచి జోరుమీదున్న విక్టరీ హీరో వెంకటేశ్‌ మరో చిత్రంలో నటించబోతున్నారు. రీమేక్‌ చిత్రాల ద్వారా హిట్స్ అందుకోవడంలో స్పెషలిస్టు వెంకటేశ్‌. తాజాగా ఈ హీరో నటిస్తున్న మరో చిత్రం ‘అసురన్‌’. ఈ నెల 20 నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది. తమిళ స్టార్‌ హీరో ధనుష్ నటించిన చిత్రం అక్కడ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలుకొట్టింది. అందుకే ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సురేశ్‌ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకటేశ్‌ సోదరుడు సురేశ్‌బాబు ఈ సినిమా నిర్మాణం చేపడుతున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మరో యువ హీరో కోసం దర్శక, నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. వెంకటేశ్‌ పక్కా పల్లెటూరి మాస్‌ యాంగిల్‌లో కనిపించబోతున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాయలసీమ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ దాదాపు 30 రోజుల పాటు షూటింగ్‌ చేయబోతున్నారట. సినిమా మొత్తం దాదాపు రెండు నెలల్లో పూర్తి చేసి వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu