HomeTelugu Newsహీరో వెంకటేష్‌ ఇంట పెళ్లి సందడి!

హీరో వెంకటేష్‌ ఇంట పెళ్లి సందడి!

Hero venkatesh daughter get
ఇటీవలే మెగా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం కూడా నటి రహస్యతో ఎంగేజ్మెంట్‌ చేసుకున్నాడు. తాజాగా సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేశ్ రెండో కూతురు హయవాహిని పెళ్లి జరగబోతోంది.

హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో పెళ్లి వేడుక జరగనుంది. హయవాహిని ఎంగేజ్మెంట్ గత ఏడాది అక్టోబర్ లో చాలా సింపుల్ గా జరిగింది. ఆ వేడుకకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చిరంజీవి, మహేశ్ బాబు హాజరయ్యారు. ఇప్పుడు పెళ్లి కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా చేయబోతున్నట్టు తెలుస్తోంది.

రేపు హయవాహిని పెళ్లి.. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో జరగనుంది. ఈ పెళ్లికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నట్టు సమాచారం. పెళ్లి ఫొటోలు బయటకు వస్తేనే… పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారనే విషయంలో క్లారిటీరానుంది. వెంకటేశ్‌కు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్దమ్మాయి అశ్రితకు 2019లో పెళ్లి జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu