మరోసారి తండ్రికాబోతున్న మంచు విష్ణు!

హీరో మంచు విష్ణు మళ్లీ తండ్రి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘స్పెషల్‌ ప్రదేశం నుంచి స్పెషల్‌ ప్రకటన. ఇది విన్నీ స్వస్థలం. నాకెంతో ఇష్టమైన ప్రదేశం. ఇప్పటికే మా కుటుంబంలోకి అరియానా, వివియానా, అవ్రామ్‌ వచ్చారు. ఇప్పుడు నాలుగో ఏంజిల్‌ కూడా రాబోతోంది’ అని పేర్కొంటూ తన భార్యతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. దాంతో అభిమానులంతా ‘కంగ్రాట్స్‌ అన్నా..’ అంటూ విషెస్‌ చెబుతున్నారు.

ప్రస్తుతం మంచు విష్ణు.. ‘ఓటర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. కార్తిక్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకలు ముందుకు తీసుకురానున్నారు. దీంతో పాటు ఆయన ‘కన్నప్ప’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రం ఇంకా స్క్రిప్టింగ్‌ దశలో ఉంది.