HomeTelugu Trendingహీరో విక్రమ్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు ట్రీట్

హీరో విక్రమ్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు ట్రీట్

7 17

హీరో విక్రమ్ అంటే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉంది. వెరైటీ కథలతో సినిమాలు చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరించే హీరో విక్రమ్‌. తెలుగు ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోకి కొంతకాలంగా సరైన హిట్‌ లేదు. ఇవాళ హీరో విక్రమ్ 54వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అందరూ అభినందనలు తెలిపారు. తాజాగా విక్రమ్ నటిస్తున్న మహావీర్ కర్ణ సినిమా మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కర్ణ సినిమా పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఆర్‌.ఎస్‌. విమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయింది. కర్ణుడిగా హీరో విక్రమ్ లుక్ అదిరింది. ఈ చిత్రంలోని కొంత భాగాన్ని హైదరాబాద్‌లో షూటింగ్ చేశారట. వచ్చే ఏడాది సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu