HomeTelugu Trendingతెలుగు సినిమాల్లో హాలీవుడ్‌ నటులు

తెలుగు సినిమాల్లో హాలీవుడ్‌ నటులు

2 22బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైంది. తెలుగు సినిమాకు మంచి పేరు వచ్చింది. బాహుబలి ఇచ్చిన కిక్ తో తెలుగు సినిమాలు విదేశాల్లో విడుదల అవుతున్నాయి. బాలీవుడ్‌లో డబ్ చేసుకొని రిలీజ్ అవుతున్నాయి. ఫ్యాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు.

ఇలా తెలుగు సినిమా పరిథి పెరగడంతో బాలీవుడ్ నటులే కాకుండా హాలీవుడ్ నటులు కూడా తెలుగు సినిమాల్లో నటించేందుకు హాలీవుడ్ నటులు సిద్ధం అవుతున్నారు. ఇటీవలే వచ్చిన ‘సైరా’ సినిమాలో హాలీవుడ్ నటులు నటించారు. బ్రిటిష్ కాలంనాటి కథతో చేసిన కావడంతో హాలీవుడ్ నటులు నటించి మెప్పించారు. అనుష్క హీరోయిన్ గా చేస్తున్న నిశ్శబ్దం సినిమాలో కూడా హాలీవుడ్ నటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. హర్రర్ ప్రదాంశంగా సినిమా తెరక్కుతోంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో ముగ్గురు హాలీవుడ్ స్టార్స్ నటిస్తున్నారు. అందులో ఒకరు హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ కాగా, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్ లు నటిస్తున్నారు. హాలీవుడ్ హీరోలు తెలుగు సినిమాల్లో నటిస్తుండటంతో… తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ లో నిర్మించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధం అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu