HomeTelugu Trending'హంట్‌' మూవీకి హాలీవుడ్‌ టచ్‌

‘హంట్‌’ మూవీకి హాలీవుడ్‌ టచ్‌

Hollywood touch to Sudhir B

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ‘హంట్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్విస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు పోలీస్‌ ఆఫీసర్‌‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ కూడా ఇస్తున్నాడు సుధీర్. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని తెరకెక్కించారు.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ ఇద్దరూ త్వరలో విడుదల కాబోతున్న ‘జాన్ విక్ 4’ అనే హాలీవుడ్ సినిమా కోసం పని చేశారు. ఈ స్టంట్స్ హంట్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, గోపరాజు రమణ, చిత్రాశుక్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu