HomeTelugu Trendingరేర్‌ ఫొటో షేర్‌ చేసిన నమ్రత

రేర్‌ ఫొటో షేర్‌ చేసిన నమ్రత

Namrata shirodkar shares me

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒక రేర్ మెమరీని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఇన్‌స్టాలో తన అభిమానుల కోసం ఒక ఆసక్తికర రోడ్ ట్రిప్ గురించి వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం స్విట్జర్లాండ్ లోని అందమైన కొండ కోనల్లో మహేష్ బాబుపై ఒక పాట చిత్రీకరణ జరుగుతోందట. అయితే అక్కడికి వెళ్లాల్సి వస్తే తాము (నమ్రత- గౌతమ్) రోడ్ ట్రిప్ లో మహేష్ ని డ్రాప్ చేసి వెళ్లారట. అది ఎంతో మరపురాని అనుభూతిగా మిగిలిందని ఒక అందమైన ఫొటోని షేర్ చేశారు నమ్రత. స్విట్జర్లాండ్ లో కొండల దిగువన ఉన్న నది వద్ద నమ్రత- గౌతమ్ ఫొటో దిగారు. చాలా కాలం నాటి ఫొటో ఇది. గౌతమ్ కి మూడు నాలుగేళ్లప్పుడు వెళ్లి ఉండొచ్చు. అన్ ఫర్ గెటబుల్ రోడ్ ట్రిప్ అంటూ ఈ ఫోటోతో పాటు లవ్ ఈమోజీల్ని షేర్ చేశారు.

స్విస్ డైరీస్.. వే బ్యాక్ వెడ్నెస్ డే .. వన్ ఫర్ ఈజ్ డే అంటూ రకరకాల హ్యాష్ ట్యాగులతో ఈ ఫొటోని వైరల్ చేస్తున్నారు. ఇది నిజంగా నమ్రత ఇన్ స్టా ఆల్బమ్‌లో వెరీ రేర్ ఫొటో. జ్ఞాపకాల్లోనూ అరుదైన సాహసయాత్ర అని చెప్పవచ్చు.

https://www.instagram.com/p/CN6t6iCjrgk/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu