అనుష్క సినిమాకు హాలీవుడ్ విలన్

సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్టయ్యాక.. ఆ సినిమాలో నటించిన వాళ్లకు వరుసగా ఆఫర్లు వస్తుంటాయి. బాహుబలి-2 తర్వాత అనుష్క మరో సినిమా చేయలేదు. అనుష్కకు కూడా వరుస ఆఫర్లు వచ్చినా ఆమె ఎందుకనో ఓకే చెప్పలేదు. లేడీ ఓరియంటెడ్ సినిమాల కోసం చూస్తుందేమో. అరుంధతి, భాగమతి, రాణి రుద్రమదేవి సినిమాలు హిట్ కావడంతో ఆ తరహా సినిమాలు చేయాలని అనుష్క అనుకుంటుందట.

కోన వెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ థ్రిల్లింగ్ సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాలో నటించేందుకు అనుష్క కూడా ఒకే చెప్పేసిందట. పక్కా స్క్రిప్ట్ వర్క్ కూడా సిద్ధం అయినట్టు సమాచారం. ఇందులో అనుష్క ఓ దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు. ఇందులో హాలీవుడ్ స్టార్ నటుడు మైఖేల్ మాడ్సెన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నాడట. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఎక్కువభాగం షూటింగ్ అమెరికాలో ఉంటుందని తెలుస్తోంది.