Homeపొలిటికల్జీరో జగన్ హీరో ఎలా అయ్యాడు?, మళ్లీ జీరోగా ఎలా మిగిలాడు ?

జీరో జగన్ హీరో ఎలా అయ్యాడు?, మళ్లీ జీరోగా ఎలా మిగిలాడు ?

How did Zero Jagan become a hero How did he become Zero again

జగన్ గురించి ఎక్కువ ఊహించుకోవద్దు. అవును, జగన్ అత్యంత అసమర్థుడు.. ప్రతిపక్ష నాయకుడిగా అట్టర్ ఫెయిల్ అయిన వ్యక్తి.. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి చేసి చెప్పుకోడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేకపోయిన వ్యక్తి. ఆఖరికి తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు కూడా సమాధానం చెప్పుకోలేకపోయాడు.. 23మంది ఎమ్మెల్యేలు, 3ఎంపీలు పార్టీ విడిచి వెళ్లిపోతుంటే అసమర్ధతతో చేష్టలుడిగి చూశాడే కానీ, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే అని వారిలో నమ్మకం కలిగించి వారిలో ఒక్కరిని కూడా కన్విన్స్ చేసి ఆపలేకపోయిన చేతకాని వ్యక్తి. ఒక సందర్భంలో జనసేనతో పొత్తు కోసం తీవ్రంగా పాకులాడిన వ్యక్తి. కానీ పవన్ 45 సీట్లు డిమాండ్ చెయ్యడంతో వెనక్కి తగ్గాడు. అలాంటి అత్యంత అసమర్థ స్థాయిలో ఉన్న పార్టీని భుజ స్కంధాలపై మోసి నానాటికీ దిగజారిపోతూ మునిగిపోతున్న వైసీపీ పార్టీని పైకి లేపింది సోషల్ మీడియా మాత్రమే.

నిజాలను వక్రీకరించడం చేతనో, అబద్ధాలు ప్రచారం చెయ్యడం వల్లనో, మార్పింగ్ లు చేసో, చిన్న తప్పులను కూడా గట్టిగా ఎండగట్టి ప్రచారం చేయడం చేతనో, జగన్ అసమర్ధతకి మసిపూసి మారేడు చేసి గొప్ప నాయకుడు అని ప్రచారం చెయ్యడం చేతనో, అప్పుడే పాపులర్ అవుతున్న మీమ్స్ ద్వారా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను వెకిలిగా ట్రోల్ చేసి వారి విలువను తగ్గించడం చేతనో…. అన్ని రకాలుగా యుద్ధం చేసి వైసీపీ జగన్ గ్రాఫ్ ఎక్కడా తగ్గకుండా పోరాటం చేసింది సోషల్ మీడియా… చాలామంది అనుకుంటూ వుంటారు ప్రశాంత్ కిషోర్ వల్లనే వైసీపీ గెలిచింది అని… మీరు గమనిస్తే ప్రశాంత్ కిషోర్ కేవలం గెలుస్తాయి అనుకునే పార్టీల కోసమే పని చేస్తాడు… గెలుస్తుంది అని నమ్మకంతోనే ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పని చేశాడు అంటే అతనికి ఆ నమ్మకం కలగడానికి కారణం సోషల్ మీడియా. తర్వాత ఎన్నో కుయుక్తులు పన్ని వైసీపీ గెలుపును సులభతరం చేసాడు.

అసలు వైసీపీ గెలుపులో జగన్ పాత్ర కేవలం 1% అయితే మిగిలిన దానిలో అభిమానులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళదే అత్యధికం.. జగన్ చేసింది ఒక్కటే, నిత్యం ప్రజల్లో ఉండటం… మింగలేని మొగుడు కోటలో ఉన్నా ఒకటే పేటలో ఉన్నా ఒకటే అని సామెత ఉంది.. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఏమీ సాధించలేని అసమర్థుడు నిత్యం ప్రజల్లో ఉండి ఏం లాభం ఆలోచించండి?? ఆ అసమర్ధుడిని హీరోగా చేసి చూపింది సోషల్ మీడియా… ఎన్నికల సమయంలో ప్రతీ బూత్ లో ప్రాణాలకు తెగించి పోరాడారు అభిమానులూ కార్యకర్తలు… కాబట్టే కనీవినీ ఎరుగని రీతిలో 151 సీట్లతో వైసీపీకి గెలుపు సాధ్యం అయింది. ఇప్పుడు జగన్ చేసిన అతి పెద్ద తప్పిందం ఏంటంటే సున్నా లాంటి తనను తాను ఎక్కువగా ఊహించుకుని కార్యకర్తలను అభిమానులను దూరం చేసుకోవడం. ఇప్పటికే ఎందరో దూరం అయ్యారు. రానున్న రోజుల్లో ఇంకా దూరం అవ్వనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu