Homeతెలుగు వెర్షన్అంబటి రాంబాబు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో అంబటి పరిస్థితేంటి ?

అంబటి రాంబాబు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో అంబటి పరిస్థితేంటి ?

How is Ambati Rambabu graph

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ‘అంబటి రాంబాబు’. ప్రస్తుతం ప్రజల్లో అంబటి రాంబాబు పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబు రెడ్డి గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లెలో అంబటి రాంబాబు జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విశాఖపట్నం లోని న్యాయ విద్యా పరిషత్ లా కళాశాలలో బి.ఎల్ పూర్తి చేశారు. అంబటి రాంబాబు విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగంలో మరియు పార్టీ అధికార ప్రతినిధిగా కీలకమైన పాత్ర పోషించారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేపల్లె నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు.

కోట్లా విజయభాస్కర్ రెడ్డి హయాంలో అంబటి రాంబాబు నెడ్ క్యాప్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఐతే, ఆ తర్వాత 1994,1999లలో రేపల్లే లో అంబటి ఓటమి పాలయ్యారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మౌళిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా 2005–2007 వరకు పనిచేశారు. జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అతనితో కలిసి నడిచిన అతి కొద్ది మంది కాంగ్రెస్ నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. జగన్ స్థాపించిన వైసీపీ పార్టీలో సీనియర్ నాయకుడుగా పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. 2022 లో జరిగిన మంత్రివర్గ విస్తరణ లో జలవనరుల శాఖ మంత్రి గా బాధ్యతలు చేపట్టారు. ఇంతకీ రాజకీయ నాయకుడిగా అంబటి రాంబాబు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో అంబటి రాంబాబు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబు పరిస్థితి ఎలా ఉండబోతుంది ?, ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. అంబటి రాంబాబు మళ్లీ గెలిచే అవకాశం లేదు. దీనికితోడు అంబటి రాంబాబు వివాదాస్పద రాజకీయ నాయకుడు. అతని మీద ఇప్పటికే చాలా వివాదాస్పద ఆరోపణలు ఉన్నాయి.

అంబటి రాంబాబు వైఎస్ కుటుంబానికి వీర విధేయుడు. వైఎస్ కుటుంబ ప్రయోజనాల కోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అంబటి బాహాటంగా ప్రకటించుకున్నారు. కానీ, అంబటి రాంబాబు ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇక ఆయన గ్రాఫ్ విషయానికి వస్తే.. అంబటి రాంబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబు గెలవడం దాదాపు కష్టమే. అంతగా ఆయన గ్రాఫ్ పడిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu