Homeపొలిటికల్బొల్లా బ్రహ్మనాయుడు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

బొల్లా బ్రహ్మనాయుడు గ్రాఫ్ ఎలా ఉంది ?, వచ్చే ఎన్నికల్లో పరిస్థితేంటి ?

How is Bolla Brahmanaidus graph

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ‘బొల్లా బ్రహ్మనాయుడు’.. మరి ప్రస్తుతం ప్రజల్లో బొల్లా బ్రహ్మనాయుడు పరిస్థితేంటి ?, వచ్చే ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతులకు అత్యంత సుప్రసిద్ధులు బొల్లా బ్రహ్మనాయుడు. తిరుమల డైరీ పెట్టి ఆయన ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. బొల్లా బ్రహ్మనాయుడు ఉమ్మడి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. 2009, 2014 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బ్రహ్మనాయుడు పాట్నా లోని మగధ దూర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేయడం జరిగింది. కానీ, 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నిరక్ష్యరాస్యుడు అని ప్రకటించారు. బ్రహ్మనాయుడు రాజకీయాల్లో రాకముందు కుటుంబ నేపథ్యం లోకి చిన్నతనంలోనే కుటుంబ ఆర్థిక నేపథ్యం కారణంగా ప్రాథమిక దశలోనే విద్యకు దూరమై వ్యవసాయ రంగంలో ప్రవేశించారు. అనంతర కాలంలో వ్యవసాయం వైపు నుండి వ్యాపార రంగంలో అడుగుపెట్టి పలు వ్యాపారాలు నిర్వహిస్తూ 2004లో తన స్నేహితులతో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ప్రైవేట్ డెయిరీ” తిరుమల పాల డెయిరీ “ని స్థాపించారు.

పైగా తిరుమల పాల డెయిరీని కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం చేయకుండా దక్షిణ భారత దేశంలోనే పాల డెయిరీ రంగంలో అగ్రస్థానంలో నిలిపారు. అయితే, వ్యాపార భాగస్వాములతో ఏర్పడ్డ భేదాభిప్రాయాలు కారణంగా 2014లో తిరుమలను ఫ్రాన్స్ కు చెందిన లాక్టలిస్ సంస్థకు విక్రయించారు. 2018లో తనే స్వయంగా వల్లభ పాల డెయిరీ ని స్థాపించారు. ప్రస్తుతం పాల డెయిరీని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. బ్రహ్మనాయుడు రాజకీయాల్లో రాకముందు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడిగా కొనసాగారు. ఐతే, ఎన్టీఆర్ మరణం తర్వాత వ్యాపార రంగంలో కొనసాగుతూ వస్తున్న వీరిని 2008 లో చిరంజీవి ఆహ్వానం మేరకు ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 లో వినుకొండ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

అనంతరం 2012 నుంచి జగన్ స్థాపించిన వైసీపీ సానుభూతి పరుడిగా క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 2013 లో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 లో పెదకూరపాడు నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వినుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. బ్రహ్మనాయుడు కుటుంబం ఆధ్వర్యంలో పల్నాడు మరియు మంగళగిరి ప్రాంతాల్లో పలు విద్యా సంస్థలు నడుస్తున్నాయి. బ్రహ్మనాయుడు రాజకీయాల్లో రాకముందు నిజాయితీపరుడైన వ్యక్తిగా పేరు గడించారు. కానీ శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి నుంచి కొంచెం వివాదాస్పద నేతగా తయారయ్యారు. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా ఇదే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బ్రహ్మనాయుడు పలు విషయాల్లో సోషల్ మీడియాకి అడ్డంగా బుక్ అయ్యారు. దీనికితోడు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడం కోసం రాజకీయ కక్షలకు దిగాడు అని టాక్ ఉంది.

దీనికితోడు వినుకొండ టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు ఆ ప్రాంత ప్రజల్లో ఫుల్ పాపులారిటీ పెరిగింది. జీవీ ఆంజనేయులు పాపులారిటీ బ్రహ్మనాయుడికి పెద్ద అడ్డంకిగా మారింది. ప్రస్తుతానికి అయితే, బొల్లా బ్రహ్మనాయుడు ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఇక ఆయన గ్రాఫ్ విషయానికి వస్తే.. బొల్లా బ్రహ్మనాయుడు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు గెలవడం దాదాపు కష్టమే. ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu