మల్లాది విష్ణు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో ఆయన పరిస్థితేంటి ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. మల్లాది విష్ణు వర్ధన్ అలియాస్ మల్లాది విష్ణు. ప్రస్తుతం ప్రజల్లో మల్లాది విష్ణు పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఒకరైన మల్లాది విష్ణు వర్ధన్ ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో జన్మించారు. ఆయన స్వగ్రామం అయితే పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయవాడ లోని వి.బి.యం కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు పూర్తి చేశారు. మల్లాది విష్ణు విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టి ఆనాటి విజయవాడ కాపు నాయకుడు వంగవీటి రంగా అనుచరుడిగా ఉన్నారు. రంగా మరణాంతరం కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ లో నాయకుడిగా ఎదుగుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఎదిగారు.
2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగర అభివృద్ధి సమాఖ్య ఛైర్మన్ గా పనిచేశారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2009అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ మధ్య నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా 2017వరకు పనిచేశారు. 2017లో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరిన విష్ణు 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధిగా విజయవాడ మధ్య నియోజకవర్గం లో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది.
ఇంతకీ, రాజకీయ నాయకుడిగా మల్లాది విష్ణు గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో మల్లాది విష్ణు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మల్లాది విష్ణు పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ మల్లాది విష్ణుకి ఉందా ?, చూద్దాం రండి. మల్లాది విష్ణు గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరోవైపు విష్ణు రాజకీయాల్లో పనిచేస్తూనే వ్యాపారవేత్తగా రాణించారు. విజయవాడ పట్టణంలో ఉన్న సంపన్న రాజకీయ నాయకుల్లో విష్ణు ఒకరని సమాచారం.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ ప్రజాప్రతినిధి కూడా.  అయితే, ప్రజల్లో మల్లాది విష్ణు పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో మల్లాది విష్ణు పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్ మల్లాది విష్ణుకి ఉందా ?, చూద్దాం రండి. మల్లాది విష్ణుకు వ్యక్తిగతంగా మంచి పేరున్నప్పటికీ.. రాజకీయ నాయకుడిగా ఆయన గ్రాఫ్ బాగా పడిపోతూ వస్తోంది. తన నియోజకవర్గంలో అస్సలు తిరగడం లేదని ఆయన పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. పైగా జగన్ రెడ్డి ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత కూడా మల్లాది విష్ణుకి మైనస్ కానుంది. వీటన్నిటి బట్టి.. మల్లాది విష్ణు మళ్లీ గెలవడం కష్టమే.
CLICK HERE!! For the aha Latest Updates