కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటా: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. కర్నూలు జిల్లా కొణిదెలలో ఇవాళ పవన్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమ నాలుగు జిల్లాలను పదేళ్లపాటు కరువు జిల్లాలుగా ప్రకటిస్తామని చెప్పారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకూ నెలకు రూ.5 వేలు పింఛన్‌ ఇస్తామని పవన్‌ హామీ ఇచ్చారు.