HomeTelugu Trendingఓటీటీలోనూ.. రికార్డు క్రియేట్‌ చేసిన 'అఖండ'

ఓటీటీలోనూ.. రికార్డు క్రియేట్‌ చేసిన ‘అఖండ’

Huge response akhanda movie

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రూపొందిన హైట్రిక్‌ మూవీ ‘అఖండ’. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 152 కోట్ల గ్రాస్, రూ.93 కోట్ల షేర్ వసూలు చేసి, ట్రేడ్ వర్గాలవారిని ఆశ్చర్యపరిచింది. నాన్ థియేట్రికల్‌తో కలిపి ఈ సినిమా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక తాజాగా ఓటీటీలో రిలీజైన ‘అఖండ’.. అక్కడ కూడా రికార్డు క్రియేట్‌ చేసింది. జనవరి 21 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హార్ట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ మూవీ.. తొలి 24 గంటల్లోనే 10 లక్షల మంది వీక్షించినట్లు సమాచారం. ఇది ఓటీటీ చరిత్రలో ఓ రికార్డు అని చెప్పొచ్చు. ఓటీటీలో భారీ ఓపెనింగ్స్‌ రావడంతో పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ‘థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన ‘అఖండ’.. ఓటీటీలోనూ రికార్డు సృష్టించడం గర్వంగా ఉంది. ఈ వేదిక ద్వారా మరింత మంది సినీ అభిమానులకు మా చిత్రం వీక్షించడం పట్ల సంతోషంగా ఉంది ‘ అన్నారు. కోవిడ్‌ కారణంగా థియేటర్స్‌లో చూడలేకపోయిన వారంతా.. ఓటీటీలో ‘అఖండ’ చిత్రం వీక్షించి ఆస్వాదించండి’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu