HomeTelugu Trendingరవితేజతో మలయాళి ముద్దుగుమ్మ!

రవితేజతో మలయాళి ముద్దుగుమ్మ!

karnan heroine Rajisha Vija
టాలీవుడ్‌ హీరో మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంతో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అయిన వెంటనే శరత్ దర్శకత్వంలో సినిమాను కూడా మొదలు పెట్టేలా రవితేజ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రవితేజ.. శరత్ మండవల కాంబో మూవీకి హీరోయిన్ గా మలయాళి ముద్దుగుమ్మ రజిష విజయన్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మలయాళంలో పలు సినిమాలతో విజయం సాథించిన రజిష విజయన్ తమిళంలో సూపర్ హిట్ మూవీ కర్ణన్ తో ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ హీరోగా రూపొందిన కర్ణన్ సినిమా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాంటి సినిమాలో కీలక పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ముద్దుగుమ్మ రజిషను రవితేజ కోసం సంప్రదించారు. టాలీవుడ్ మార్కెట్ నేపథ్యంలో ఆమె కాదనకుండా వెంటనే రవితేజ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రజిషకు తెలుగులో మంచి భవిష్యత్తు ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu