HomeTelugu Trendingపవన్ కల్యాణ్‌ అలాంటి వ్యక్తి కాదు: హైపర్ ఆది

పవన్ కల్యాణ్‌ అలాంటి వ్యక్తి కాదు: హైపర్ ఆది

Hyper Adi

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ గురించి జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కామెంట్స్ చేశాడు. ఆది ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ గురించి మాట్లాడారు. ఇప్పుడున్న రోజుల్లో డబ్బు ఎలాంటి వ్యక్తినైనా మార్చేస్తుంది. కానీ పవన్ కల్యాణ్ అలాంటి వ్యక్తి కాదు అన్నారు. డబ్బంటే పవన్ కల్యాణ్‌కు ఆసక్తి లేదు. ఆయన ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తాడు అన్నాడు.

పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న హరిహరవీరమల్లు చిత్రానికి సంబంధించి చిన్న వర్క్ చేస్తున్నానని ఆది అన్నారు. దానిలో భాగంగా ఇటీవల ఆయనను వ్యక్తిగతంగా కలిశానని చెప్పారు. ఆయన ఎంత గొప్ప మనిషో మరింత అర్థమైందని అన్నారు. పవన్‌కు ఒక సినిమాలో రూ.50 కోట్లు వస్తే ఆ మొత్తాన్ని పేదలకు సహాయం చేయడానికి ఉపయోగిస్తారని ఆయన వ్యక్తిత్వం అలాంటిదని అన్నారు. అందరి మంచి కోరుకునే పవన్ కల్యాణ్‌కు మంచి జరగాలని నేను కోరుకుంటాను, ఆయనపై నా భావన అదే అన్నారు. ఆయనను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను అన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu