HomeTelugu Big Stories'ఇస్మార్ట్‌ శంకర్‌' నాకు పిచ్చిపట్టించింది.. పార్టీలో వర్మ రచ్చ

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నాకు పిచ్చిపట్టించింది.. పార్టీలో వర్మ రచ్చ

10 17సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ పార్టీలో తెగ హంగామా చేశారు. ఆనందంతో మద్యం సీసాను తలపై పోసుకున్నారు. ఆయన అలా చేస్తుంటే పార్టీలో ఉన్న యూనిట్‌ మొత్తం చప్పట్లు కొడుతూ, కేకలు పెట్టారు. అనంతరం వర్మను పూరీ జగన్నాథ్ హత్తుకోగా.. ఛార్మిని వర్మ హత్తుకున్నారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆర్జీవీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నాకు పిచ్చిలేదు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ నాకు పిచ్చిపట్టించింది. దీనికి పూరీ, ఛార్మిలను నిందించండి’ అని పోస్ట్‌ చేశారు.

వర్మ, అజయ్‌ భూపతి, అగస్త్య కలిసి శనివారం మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌కు బైక్‌పై వెళ్లారు. ముగ్గురూ మాస్‌ గెటప్‌లో సిద్ధమై, రోడ్డుపై బైక్‌లో వెళ్తున్న ఫొటోను వర్మ తాజాగా షేర్‌ చేశారు. థియేటర్‌కు వెళ్లిన తర్వాత తీసిన వీడియోను కూడా పంచుకున్నారు. ‘నేను మాస్‌ గెటప్‌లో జేబు దొంగలా ఉన్నాను’ అని ఆయన తనను తానే కామెంట్‌ చేసుకున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu