HomeTelugu Trendingప్రభాస్‌తో అది చేసి తీరతా..!

ప్రభాస్‌తో అది చేసి తీరతా..!

3 20

మహర్షి సినిమా విజయవంతం నేపథ్యంలో దర్శకుడు వంశీపైడిపల్లి ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభాస్‌తో ఎప్పటికైనా హిట్‌ కొడతానని అన్నారు. త్వరలోనే ప్రభాస్‌ కోసం స్క్రిప్టును సిద్ధం చేస్తానని అన్నారు. ఈసారి కచ్చితంగా ఆయనతో హిట్‌ కొడతానని చెప్పారు. అనంతరం ప్రభాస్‌ వ్యక్తిత్వాన్ని వంశీ మెచ్చుకున్నారు. ఫ్లాప్‌ సినిమా ఇచ్చినా ప్రభాస్‌ ఎప్పుడూ తనను దూరం పెట్టలేదని, స్నేహంగా ఉన్నారని వంశీ తెలిపారు.

2007 సంవత్సరంలో ప్రభాస్‌-వంశీ కాంబినేషన్‌లో ఇలియానా హీరోయిన్‌గా మున్నా అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయింది. దీన్ని ఉద్దేశిస్తూ వంశీ ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడారట. మహేశ్‌బాబు హీరోగా వంశీ తీసిన మహర్షి సినిమా ఇటీవల విడుదలై ప్రశంసలు పొందింది. రైతులు, వ్యవసాయం నేపథ్యంలో సామాజిక సందేశంతో రూపొందిన సినిమా బాక్సాఫీసు వద్ద కూడా విజయం సాధించింది. దీని తర్వాత వంశీ తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu