HomeTelugu Trending'ఇచ్చట వాహనములు నిలుపరాదు' టీజర్‌

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ టీజర్‌

IchataVahanumuluNiluparadu

అక్కినేని హీరో సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది దీనికి ఉప శీర్షిక. కొత్త దర్శకుడు ఎస్. దర్శన్ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నాడు. ఏ1 స్టూడియోస్ మరియు శాస్త్ర మూవీస్ బ్యానర్లపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి , నటుడు హరీష్ కోయలగుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా టీజర్ ని సోషల్మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు. ఈ టీజర్‌ సుశాంత్‌ లుక్‌, డైలాగ్స్‌ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, నిఖిల్, కైలాస, కృష్ణచైతన్య తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu