HomeTelugu Trendingఆహాలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఎప్పుడంటే..?

ఆహాలో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఎప్పుడంటే..?

Ichata vahanamulu niluparad

అక్కినేని సుశాంత్‌ హీరోగా ఎస్‌.దర్శన్‌ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా థ్రిల్లర్‌ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరలు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కామెడీ.. రొమాన్స్‌.. యాక్షన్‌.. థ్రిల్లింగ్‌.. ఇలా అన్ని అంశాల‌ను స‌మ‌పాళ్లలో మేళ‌విస్తూ ద‌ర్శకుడు ఈ కథను తీర్చిద్దిన విధానం మెప్పించింది. కాగా, ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా సెప్టెంబరు 17వ తేదీ నుంచి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ స్ట్రీమింగ్‌ అవుతుందని మేకర్స్‌ ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu