HomeTelugu Trendingమరోసారి గోవా బ్యూటీతో పవన్‌ కల్యాణ్‌!

మరోసారి గోవా బ్యూటీతో పవన్‌ కల్యాణ్‌!

4 16
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పింక్ సినిమాకు రీమేక్. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ కు జంటగా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే శృతి హాసన్ నేను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం లేదు అని క్లారిటీ ఇచ్చింది. ఇక శృతి ఈ సినిమాకు నో చెప్పడం తో మళ్ళీ హీరోయిన్ వేటలో పడింది మూవీ యూనిటి. తాజాగా పవన్ కు జంటగా ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానాను తీసుకోవాలని చూస్తున్నారట. అయితే ఇదివరకే వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన జల్సా సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. మరి చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో అని. అయితే పవన్ తర్వాత సినిమా డైరెక్టర్‌ క్రిష్‌ తో ఇప్పటికే మొదలయ్యింది. కానీ ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్లు లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయాయి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu