తలైవి’ ట్రైలర్‌

Thalaivi trailer
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘తలైవి’ ట్రైలర్‌ విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత బయోపిక్‌ ‘తలైవి’లో కంగనా ప్రధానపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ‘అమ్మ’ పాత్రలో కంగనా ఒదిగిపోయింది. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 23న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రకాష్‌రాజ్‌, అరవిందస్వామి, జిషు సేన్‌గుప్తా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విబ్రి పతాకంపై విష్ణువర్థన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

CLICK HERE!! For the aha Latest Updates