HomeTelugu News'భారతీయుడు 2' షూటింగ్ అప్‌డేట్స్‌

‘భారతీయుడు 2’ షూటింగ్ అప్‌డేట్స్‌

1 28స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తన తదుపరి చిత్రం పనులు ప్రారంభించాడు. కమల్‌ హాసన్‌ హీరోగా ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ‘భారతీయుడు 2’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు చిత్రయూనిట్‌. కొత్త ఏడాది జనవరిలో భారతీయుడు 2 షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించనున్నారు.

తరువాత పొల్లాచ్చిలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసి మేజర్‌ షెడ్యూల్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తయితే 2020 జనవరిలో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా తరువాత కమల్‌ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పునున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో భారతీయుడు 2 భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu