HomeTelugu Newsభారతదేశపు తొలి అండర్‌ వాటర్ మెట్రో.. ప్రయాణికుల కోసం రెడీగా ఉంది

భారతదేశపు తొలి అండర్‌ వాటర్ మెట్రో.. ప్రయాణికుల కోసం రెడీగా ఉంది

indias first under water metro

భారత దేశ ప్రగతి ప్రయాణంలో భాగంగా.. మరో అద్భుతం ఆవిష్కృతమైంది. నదీ గర్భాన మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. 300 సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రక నగరమైన కోల్ కతాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వాహన కాలుష్యాన్ని తగ్గించడమే దీని లక్ష్యం. హుగ్లీ నది కింద ఉన్న 520 మీటర్ల దూరాన్ని మెట్రో 45 సెకన్లలో చేరుకోగలదు. కోల్ కతాలో హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు 4.8 కిలోమీటర్ల ఈస్ట్-వెస్ట్ మెట్రోను రూ.4,965 కోట్లతో నిర్మించారు.

పశ్చిమ బెంగాల్లోని కోల్ కతా – హౌరాలను కలిపే భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో మార్గాన్ని, దేశవ్యాప్తంగా రూ .15,400 కోట్ల విలువైన ఇతర కనెక్టివిటీ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ (మార్చి6)న బుధవారం ప్రారంభించారు.

హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లానేడ్ వరకు 4.8 కిలోమీటర్ల ఈస్ట్-వెస్ట్ మెట్రోను రూ.4,965 కోట్లతో నిర్మించారు. ఈ కారిడార్లో భారతదేశంలో అత్యంత లోతైన మెట్రో స్టేషన్ హౌరా – 30 మీటర్ల వద్ద ఉంటుంది. “ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ హుగ్లీ నది క్రింద భారతదేశంలో మొదటి నదీ రవాణా సొరంగంగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది 520 మీటర్ల పొడవు, 13 మీటర్ల లోతున ఉంది.

గరిష్టంగా హౌరా వద్ద 30 మీటర్ల లోతున ఇక్కడి మెట్రో స్టేషన్ ఉంటుంది. ప్రయాణికులకు అండర్ వాటర్ ప్రపంచం అనే భావన కలిగించేందుకు సొరంగాల లోపలి భాగాన్ని ప్రత్యేకంగా నీలిరంగు లైట్లతో ప్రకాశింపజేశారు. లోపలి గోడలపై కనీసం 40 ప్రకాశవంతమైన చేపల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ అండర్ వాటర్ సెక్షన్ లో కొన్ని స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు” అని కోల్ కతా మెట్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

హుగ్లీ నదికి పశ్చిమ ఒడ్డున ఉన్న హౌరా నుండి తూర్పున ఉన్న సాల్ట్ లేక్ సిటీని కలిపే మెట్రో మార్గం ఇది. ఈ రెండు స్టేషన్ల మధ్య 16.5 కిమీల దూరం ఉంటుంది. ఈ మార్గంలో 10.8 కిలోమీటర్లు భూగర్భంలో ఉండగా, 5.75 కిలోమీటర్లు వయాడక్ట్ పై ఉంటుంది. హౌరా మైదాన్ నుంచి సాల్ట్ లేక్ సెక్టార్ 5 వరకు మొత్తం ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ త్వరలోనే అందుబాటులోకి రానుందని కోల్ కతా మెట్రో సీనియర్ అధికారి తెలిపారు. ఇది భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండు రైల్వే స్టేషన్లైన సీల్దా మరియు హౌరా స్టేషన్లను కలుపుతుంది. కోల్‌కతా మెట్రో భారతదేశంలో మొట్టమొదటి మెట్రో వ్యవస్థ, ఇది 1984 అక్టోబర్ 24 న అందుబాటులోకి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!