HomeTelugu Trending'నా సామిరంగ' మెలోడి సాంగ్‌

‘నా సామిరంగ’ మెలోడి సాంగ్‌

Inka Inka song from Naa Saa
అక్కినేని నాగార్జున హీరోగా- విజయ్ బిన్నీ డైరెక్షన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘నా సామిరంగా’. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే.. ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే ..’ అంటూ ఈ పాట సాగుతోంది. నాగార్జున – ఆషిక రంగనాథ్ కాంబినేషన్లో .. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన పాట ఇది. ఫీల్ తో కూడిన మెలోడీ సాంగ్ ఇది.

కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను మమన్ కుమార్ – సత్య యామిని ఆలపించారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు అల్లరి నరేశ్, రామ్‌ తరుణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. వారికి జంటగా మిర్నా, రాజ్ తరుణ్, రుక్సార్ థిల్లాన్ కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu