HomeTelugu Trendingరానా తమ్ముడు అభిరామ్‌ కారుకు ప్రమాదం

రానా తమ్ముడు అభిరామ్‌ కారుకు ప్రమాదం

Abhiram daggubati car accid
టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ కారుకు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనేందుకు హైదరాబాద్‌లోని మణికొండ వచ్చాడు. అక్కడ కారు యజమానిని కలిసి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకుని సతీశ్ అనే స్నేహితుడితో కలిసి వెళ్లాడు.

ఈ క్రమంలో పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులో అభిరామ్ బీఎండబ్ల్యూ కారు, బ్రెజా కారు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో నిన్న సాయంత్రం రాజు, అభిరామ్ ఇద్దరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు, అభిరామ్‌లకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా ఎవరూ మద్యం మత్తులో లేరని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu