HomeTelugu Big StoriesRam Charan: తండ్రిని మించిన తనయుడిగా రామ్‌చరణ్‌

Ram Charan: తండ్రిని మించిన తనయుడిగా రామ్‌చరణ్‌

Ram charanRam Charan Birthday Special: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి27) రేపు. ఈ క్రమంలో ఆయన బర్త్‌డే సెలబ్రేషన్ కోసం ఫ్యాన్స్‌ భారీ ఏర్పాటులు చేస్తున్నారు. టాలీవుడ్‌లో మెగా వారసుడిగా ‘చిరుత’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్‌ చరణ్‌. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ‘మగధీర’ చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో చరణ్ రేంజ్ పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశాడు. వాటిలో కొన్నిహిట్‌లు కాగా.. మరికొన్ని ఫ్లాప్స్‌గా నిలిచాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ సినిమా ఆయనకు అతిపెద్ద విజయం సాధించి పెట్టింది. ఈసినిమాలో చరణ్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు.

Interesting facts about Ram

రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రామ్‌ చరణ్‌ కెరీయర్‌నే మార్చేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటించిన రామ్‌చరణ్‌ను ఎన్నో అవార్డులు వరించాయి. పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత రామ్‌చరణ్‌ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగా వారసుడు కాస్తా గ్లోబల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

మెగాస్టార్‌ చిరంజీవికి సౌత్‌లోనే మంచి గుర్తింపు ఉంది. కానీ చరణ్‌ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చున్నాడు. చిరంజీవి కొడుకు రామ్‌చరణ్‌ అనే గుర్తింపు నుండి.. రామ్‌చరణ్‌ త్రండి చిరంజీవి అనే రేంజ్‌కి చేరుకున్నాడు. అందుకు అయోధ్య రామ మందిరం ఈవెంట్‌లోని ఘటన ఓ ఉదాహరణ. ఆ ఈవెంట్‌లో తీసిన ఓ వీడియో అప్పట్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యాన్స్‌ కూడా తండ్రిని మించిన తనయుడు అని మురిసిపోతూ ఉంటారు. రామ్‌చరణ్‌కు ఈస్థాయిలో గుర్తింపు రావడానికి రాజమౌళియే కారణం.

Ram charan1

ప్రస్తుతం రామ్‌చరణ్‌ తన సినిమాల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉన్నాడు. ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమా దాదాపు పూర్తి కావొచ్చింది. ఆ తరువాత బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో (RC16) చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ‘రంగస్థలం’ కాంబో సుకుమార్‌ డైరెక్షన్‌లో సినిమా ప్రకటించాడు. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రామ్‌ చరణ్‌ బర్త్‌డే సందర్భంగా పలు మూవీ అప్డేట్స్‌ వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu