HomeTelugu Big Storiesసినీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

సినీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు..

7
2020 నూతన సంవత్సంరలోకి అడుగుపెట్టాం… ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వారి వారి చిత్రాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర పోస్టర్లను కూడా విడుదల చేశారు.

‘2019లాంటి ఓ గొప్ప సంవత్సరంలో ఆశీస్సులు అందించిన దేవుడికి ధన్యవాదాలు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నా కుటుంబానికి, నాతో ఎప్పుడూ ఉండే నా స్నేహితులకు, వారి ప్రేమాభిమానాలతో నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూ ఇయర్‌ 2020.’ – మహేశ్‌ బాబు

‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాను.’ – ఎన్టీఆర్‌

‘ప్రతి ఒక్కరికీ హ్యాపీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇయర్‌. వెల్‌కమ్ 2020, ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ’ – ఆర్‌ఆర్‌ఆర్‌ టీం

‘నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, భోగ భాగ్యాలను షిర్డీ సాయి నాథుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’ – మోహన్‌ బాబు

 

‘కొత్త కలలు, కొత్త ఆశలు, కొత్త కోరికలు.. ప్రతి ఒక్కరికీ చేకూరాలని, ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటున్నాను.’ – దిల్‌ రాజు

‘2020 ప్రతి ఒక్కరీ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌ ‘ – ప్రభాస్‌

‘హ్యాపీ న్యూ ఇయర్‌ 2020. ఈ ఏడాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు చేకూరాలని కోరుకుంటున్నాను’ – రవితేజ

‘ఎంతో అద్భుతమైన 2020 ఏడాదిలో అందరి జీవితాలు వెలుగులమయం కావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌’ – నాగార్జున

‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరిపై దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను’ – రజనీకాంత్‌

‘ఈ కొత్త సంవత్సరంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్నవారి పట్ల దయ, గౌరవం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనతోపాటు ఈ భూమ్మీద జీవిస్తున్న మూగ జీవులను కూడా జాగ్రత్తగా చూసుకుందాం.’ – అడివి శేష్‌

‘హ్యాపీ న్యూ ఇయర్‌. లవ్‌ యూ ఆల్‌. ఈ ఏడాది అందరికీ అద్భుతంగా ఉండాలని కోరకుంటున్నాను. సంతోషాన్ని పంచండి, ద్వేషాన్ని కాదు.’ – మంచు మనోజ్‌

‘గోపీచంద్‌ 28′ చిత్రబృందం తరఫున హ్యాపీ న్యూ ఇయర్‌. ఈ 2020 ప్రతి ఒక్కరికీ ది బెస్ట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను.’ – సంపత్‌ నంది

‘హ్యాపీ న్యూ ఇయర్‌ టు ఆల్‌’ – హారీశ్‌ శంకర్‌

‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీకు మున్ముందు అన్నీ మంచే జరగాలని కోరుకుంటున్నాను.’ – రష్మిక

‘ఆత్మీయులకు, స్నేహితులకు, ఇతర కుటుంబసభ్యులతోపాటు సంగీత ప్రియులకు హ్యాపీ న్యూ ఇయర్‌. మీకు ఈ ఏడాది సంతోషం చేకూరాలని కోరుకుంటున్నాను.’ – ఎ.ఆర్‌.రెహమాన్‌

‘మెగాస్టార్‌ చిరంజీవి 152 చిత్రబృందం నుంచి ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.’ – కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ

‘గడిచిన ఏడాది నా జీవితంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో విశేషాలను అందించింది. 2019లో నా ప్రయాణంలో నాకు సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 2020లో నేను నటించబోతోన్న ‘అశ్వథ్థామ’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా అందర్నీ అలరించబోతోందని భావిస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్‌ 2020′ – నాగశౌర్య

‘జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను గడిచిన ఏడాది నాకందించింది. అలాగే నాకెన్నో పాఠాలను కూడా నేర్పించింది. హ్యాపీ న్యూ ఇయర్‌ . సంతోషంగా నువ్వు బతికి ప్రతి ఒక్కరినీ బతికించు’ – అల్లరి నరేష్‌

Recent Articles English

Gallery

Recent Articles Telugu