HomeTelugu Big StoriesNagarjuna-Dhanush Movie: ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ .. నాగ్‌ రోల్‌ ఇదే

Nagarjuna-Dhanush Movie: ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ .. నాగ్‌ రోల్‌ ఇదే

Interesting rumors on Nagar
శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తమళ స్టార్‌ హీరో ధనుష్- నాగార్జున మల్టీస్టారర్‌ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వల్ల తిరుమలలో రోడ్లు జామయ్యాయి అని వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాకి ధారావి అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ధారావి అనగానే ముంబై గుర్తొస్తుంది. రజనీకాంత్‌ కాలా సినిమా కూడా ఈ ధారావి బ్యాక్ గ్రౌండ్‌లోనే జరిగింది.

కేవలం ముంబై సిటీ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్లమ్ ఏరియాల్లో ధారావి ఒకటి. ధనుష్‌- నాగ్‌ సినిమాకి కూడా ఇదే టైటిల్ ఫిక్స్ చేయనున్నారు అని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాగార్జున ఒక డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని టాక్‌. గతంలోనే నాగార్జున హీరోగా ‘డాన్’ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన స్టైల్‌ అదిరిపోయింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ నాగ్‌ డాన్ పాత్రలో ఆయన నటించబోతున్నాడు.

ఈ సినిమాని నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర్స్ పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావులు నిర్మిస్తుండగా సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu