అఖిల్ ముహూర్తం ఫిక్స్ చేశాడు!

అక్కినేని అఖిల్ తన రెండవ చిత్రం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా.. అని అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ నిశ్చితార్ధం జరిగిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.

ఇటీవలే తన నిశ్చితార్ధం జరగడంతో ఇక సినిమాపై తన ఫోకస్ పెట్టాడు. సినిమా మొదలుపెట్టడానికి చిత్రబృందం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జబవరి 4న సినిమా ఆరభించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ రోజు నుండి 8 రోజుల పాటు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనున్నట్లు చెబుతున్నారు.

సినిమాలో ముఖ్య పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో అఖిల్ కు జంటగా మేఘా ఆకాష్ కనిపించనుంది.