HomeTelugu Trendingనాని 28వ చిత్రానికి క్రేజీ టైటిల్

నాని 28వ చిత్రానికి క్రేజీ టైటిల్

Interesting title ante sun
నెచ్యులర్‌ స్టార్‌ నాని ’28వ చిత్రం’ అప్‌డేట్‌ వచ్చేసింది. వివేక్‌ ఆత్రేయ డైరెక్షన్‌లో, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అంటే సుందరానికి…’ అనే క్రేజీ టైటిల్‌ను ప్రకటించారు. మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. అంతేకాక నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటోంది.

ఇక నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించనుండగా, డైరెక్టర్‌ వివేక్‌ రచయితగానూ మారారు. ఇప్పటికే ‘బ్రోచేవారేవరురా’, ‘మెంటల్‌ మదిలో’వంటి హిట్‌ సినిమాలతో అతి తక్కువ కాలంలోనే వివేక్‌ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నవీన్‌ ఎర్‌నేని, రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నాని ‘టక్‌ జగదీష్‌’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చేయనున్నాడు. ఆ తర్వాత ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu