HomeTelugu Trendingస్పై: ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

స్పై: ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల

Intro Glimpse from SPY
టాలీవుడ్‌ యంగ్‌ హీర నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’. ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్‌’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బీహెచ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఇందులో మంచు కొండల్లో హీరో నిఖిల్‌ ఒంటరిగా నడుస్తూ కనిపించాడు.

ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్‌ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బుల్లెట్లుతో సహా నింపుకుని సమరానికి రెడీ అయ్యాడు. మరి ఈ బుల్లెట్ల వర్షం ఎవరి మీదైనా కురిపించడానికా? తనను తాను కాపాడుకోవడానికా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!. కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిన్న ఈ సినిమాకి శ్రీచరణ పాకాల సంగీతం అందిస్తున్నాడు. హాలీవుడ్‌ టెక్నీషియన్‌ జులియన్‌ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇదే ఏడాది దసరాకు ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu