HomeTelugu Trendingవిజయ్‌తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్

విజయ్‌తో మృణాల్ ఠాకూర్ రొమాన్స్

 

Vijay and Mrunal

విజయ్ దేవరకొండకు వరుస ఫ్లాపులు పడుతున్నా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన లైగర్ ఫ్లాప్ ఊహించని విజయ్ కొద్దిపాటి గ్యాప్‌తో ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు విజయ్.

పాన్ ఇండియా లెవల్లో లైగర్ ఫ్లాప్ అయినా మరోసారి ఖుషీతో పాన్ ఇండియా లెవల్‌లోనే ప్రయత్నం చేస్తున్నాడు ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ మరో రెండు సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో గీతా గోవిందం డైరెక్టర్ పరుశురామ్‌తో ఓ సినిమా ఉంది.

విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డైరెక్టర్ పరశురామ్ మృణాల్‌తో చర్చలు జరిపారు. కథ వినిపించగానే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు.

విజయ్ జెర్సీ ఫేమ్ గౌతం తిన్ననూరితో విజయ్‌ దేవరకొండ మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu