Bigg Boss 8 Telugu re-entry:
Bigg Boss 8 Telugu నుండి ఇటీవలే మణికంఠ స్వచ్చందంగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి, అభిమానులను నిరాశపరిచారు. ఇది కేవలం ఒక ఎలిమినేషన్ కాదని, ఒక స్ట్రాంగ్ హౌస్ మేట్ గేమ్ నుండి తప్పుకోవడం చాలా మంది అభిమానులకు షాక్ ఇచ్చింది.
ఇప్పుడు, ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారిలో ఒకరు మళ్ళీ ఇంట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సోనియా ఆకుల లేదా ఆదిత్య ఓం లలో ఒకరు రీఎంట్రీ చేయబోతున్నారని సమాచారం. షో మేకర్స్ సోనియా ఆకులని తిరిగి గేమ్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నారు. కానీ, ఆమె అలా రీ ఎంట్రీ ఇవ్వడానికి సోనియా అంత ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అందుకే ఆదిత్య ఓం రీఎంట్రీ చేసే అవకాశం ఉంది. కానీ, అభిమానుల అభిప్రాయాల ప్రకారం ఆయన పెద్దగా ఎంటర్టైన్ చేయలేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక షో మేకర్స్ ఎవరిని తిరిగి తీసుకురావాలనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఎవరు వచ్చినా షోలో కొత్త మలుపులు వచ్చే అవకాశముంది.
ఇకపోతే, నామినేషన్ ప్రక్రియ కూడా ఆసక్తిగా సాగింది. ఇప్పటి వరకు ఇంట్లో కొందరు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. వారు నామినేషన్‌లో పడితే ఎలిమినేషన్‌కు భయపడి ఎలాంటి స్ట్రాటజీలను అమలు చేస్తున్నారో చూడాలి.
ఇంతకుముందు జరిగిన ఎలిమినేషన్‌లకు కూడా ప్రేక్షకుల నుండి సరిగ్గా స్పందన రాలేదు. కానీ ఈసారి గేమ్ మరింత గందరగోళంగా, ఉత్కంఠగా మారబోతోంది. ఇంటి సభ్యుల మధ్య సంబంధాలు కూడా కొంత ఇబ్బందిగా మారుతున్నాయి. ఇక రాబోయే కొన్ని రోజులలో బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో చూడాలి. ప్రత్యేకంగా ఎలిమినేటైన వారిలో ఎవరు తిరిగి గేమ్‌లోకి వస్తారన్నది ఒక పెద్ద ఆసక్తికర విషయం. సోనియా తిరిగి వస్తుందా? లేదా ఆదిత్య ఓంకి అవకాశం వస్తుందా? చూడాలి.
Read More: Raayan సినిమా టీవీలో ఎప్పుడు చూడచ్చంటే!