Homeతెలుగు Newsదూసుకుపోతున్న నభా నటేష్

దూసుకుపోతున్న నభా నటేష్

3 14
హీరో రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల మోత మోగించిన ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలోని హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్‌లు ప్రస్తుతం వారి కెరీర్లో దూసుకుపోతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. పూరీ చాలాగ్యాప్ తర్వాత మంచి హిట్ అందుకున్నాడు. ముఖ్యంగా కుర్రకారు హార్ట్ బీట్ పెంచే హీరోయిన్‌గా నభా నటేష్ మారింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్‌తో ఈ బెంగుళూరు భామ కెరీర్‌ టాప్ గేర్లో పడింది. నన్నుదోచుకుండువటే, ఇస్మార్ట్ శంకర్ చిత్రాల్లోని పాత్రలతో శభాష్ అనిపించుకున్న నభా నటేష్ ఇప్పుడు తెలుగు పరిశ్రమలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

సాయిధరమ్ తేజ్ పక్కన సోలో బ్రతుకే సో బెటర్, రవితేజతో డిస్కో రాజా చిత్రాల్లో నటించబోతుంది. రవితేజ డిస్కో రాజా చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. అంతేకాకుండా నభా పలు ఈవెంట్స్‌లలోను ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఈవెంట్ కి అయినా నభా ఫస్ట్ ఆప్షన్ అయ్యింది. తాజాగా మెర్సిడస్ బెంజ్ కారుతో దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ పిక్స్ లో నభా లుక్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. అంతేకాకుండా తన సోషల్ మీడియా ఫాలో వర్స్‌కి గ్రాటిట్యూడ్ చెబుతూ ఈ పిక్స్ ని షేర్ చేసుకుంది నభా నటేష్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu