HomeTelugu Trendingసాయి పల్లవికి ఐటమ్‌ సాంగ్‌ ఆఫర్‌.. కోటిన్నర రెమ్యూనరేషన్‌!

సాయి పల్లవికి ఐటమ్‌ సాంగ్‌ ఆఫర్‌.. కోటిన్నర రెమ్యూనరేషన్‌!

5 23
శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సాయి పల్లవి. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పల్లెటూరు అమ్మాయిగా అదరగొట్టింది. ఆ తర్వాత ‘ఎంసీఏ’, ‘పడి పడి లేచే మనసు’, ‘కణం’,’మారి 2′, ‘ఎన్ జీ కె’ చిత్రాల్లో నటించి అందర్నీ మెప్పించింది. కెరీర్ ప్రారంభం నుండి కమెర్షియల్ సినిమాలవైపు పరుగులు తీయకుండా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం సాయి పల్లవికి ఓ ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చిందట. దీని కోసం ఈ బ్యూటీకి దాదాపు కోటిన్నర ఆఫర్ చేశారట మూవీయూనిట్. అయితే ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందట సాయి పల్లవి. రెమ్యూనరేషన్ భారీగా ఆఫర్ చేసినప్పటికీ హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం కరెక్ట్ కాదని ఆ ఆఫర్ ను తిరస్కరించిందట. ప్రస్తుతం సాయి పల్లవి నాగచైతన్య ‘లవ్ స్టోరీ’.. రానా ‘విరాటపర్వం’ సినిమాల్లో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu