ఆ కత్తికి విషం లేదు..


విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కోడెపందాల్లో కోళ్లకు కట్టే కత్తితో దాడి చేయడం సంచలనమైంది.. మరోవైపు ఆ కత్తికి విషం పూసి దాడికి పాల్పడి ఉండవచ్చు అనే అనుమానాలను వ్యక్తం చేశారు వైసీపీ నేతలు.. అయితే ఆ కత్తి విషపూరితమైనది ఏమీ కాదని తేల్చారు వైద్యులు… వైఎస్ జగన్‌కు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ సాంబశివారెడ్డి ఓ ప్రముఖ ఛానల్‌కు వెల్లడించారు. జగన్ పై దాడి చేసిన కత్తికి సంబంధించి టాక్సికాలజీ రిపోర్ట్ లో అల్యూమినియం వాడినట్టు నివేదిక వచ్చిందన్నారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన సాంబశివారెడ్డి.. ఇప్పుడే ఆయనకు డ్రెస్సింగ్ చేశామని… బీపీ కంట్రోల్‌లోనే ఉంది… పూర్తిస్థాయిలో గాయం మానడానికి మాత్రం నెలన్నర రోజులు పడుతుందన్నారు. అయితే జగన్ పాదయాత్రకు వెళ్తే మాత్రం కొన్ని‌జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామని తెలిపారు. మరోవైపు షెడ్యూల్ ప్రకారం జగన్ పాదయాత్ర ఈ శనివారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.