జ‌న‌సేన కోసం ప్ర‌చారం చేస్తున్న హైప‌ర్ ఆది.. ప‌వ‌న్ మాదిరే మెడలో రెడ్‌ టవల్‌

జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్.. హైప‌ర్ ఆది రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు ఈయ‌న జ‌న‌సేన కోసం ప్ర‌చారం మొద‌లు పెట్టాడు. ఆది దూకుడు చూస్తుంటే ఈయ‌న త్వ‌ర‌లోనే ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి కూడా వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. అంత‌గా దూసుకుపోతున్నాడు ఆది. మొన్న‌టి వ‌ర‌కు బ‌య‌టి వేదిక‌ల్లో మాత్ర‌మే ప‌వ‌న్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ఆది.. ఇప్పుడు ఏకంగా ఆయ‌న కోసం రోడ్కెక్కాడు. ప‌వ‌న్‌కు ఓటేస్తే మార్పు వ‌స్తుంద‌ని చెబుతున్నాడు ఆయ‌న‌.

అచ్చంగా ప‌వ‌న్ మాదిరే రెడ్ ట‌వ‌ల్ మెడ‌లో వేసుకుని ప్ర‌చారంలో దూసుకుపోతున్నాడు. అస‌లు హైప‌ర్ ఆది వ‌ల్ల పార్టీకి లాభం ఉంటుందా ఉండదా అనేది ప‌క్క‌న బెడితే త‌ను మాత్రం ప్ర‌చారం చేస్తూనే ఉంటాన‌ని చెబుతున్నాడు. పైగా నాగ‌బాబు కూడా ఇప్పుడు రాజ‌కీయాల్లో కూడా బిజీ అవుతున్నాడు. ఈయ‌న త‌న త‌మ్ముడు జ‌న‌సేన నుంచి పోటీ చేస్తున్నాడు. ఇన్ని రోజులు కేవ‌లం ప‌రోక్ష రాజ‌కీయాల్లో మాత్ర‌మే ఉన్న ఈయ‌న‌.. ఇప్పుడు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగాడు. న‌ర‌సాపురం నుంచి ఎంపిగా పోటీకి దిగుతున్నాడు నాగ‌బాబు.

త‌మ్ముడు త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కం నిలబెట్టుకుని క‌చ్చితంగా లోక్ స‌భకు వెళ్తానంటున్నాడు మెగా బ్ర‌ద‌ర్. న‌ర‌సాపురంలో ఈ సారి గ‌ట్టి పోటీ ఉంది. వైసీపీ నుంచి ర‌ఘురామ కృష్ణం రాజు.. టీడీపీ నుంచి శివ‌రామ‌రాజు.. నాగ‌బాబుకు పోటీగా ఉన్నారు. ఇందులో వైసీపీ నుంచి గ‌ట్టి పోటీ ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇక ఇప్పుడు నాగ‌బాబుకు అండ‌గా జ‌బ‌ర్ద‌స్త్ హైప‌ర్ ఆది ప్ర‌చారం చేస్తున్నాడు. ఆయ‌న‌తో పాటు జ‌న‌సేన పార్టీకే మీ ఓటు అంటున్నాడు‌.

త‌న‌కు లైఫ్ ఇచ్చిన వాళ్ల కోసం ఈ మాత్రం చేయ‌క‌పోతే ఎలా అంటున్నాడు‌. నాగ‌బాబు లాంటి మంచి మ‌న‌సున్న వ్య‌క్తిని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉందంటున్నాడు హైప‌ర్ ఆది. దాంతో పాటు జ‌న‌సేన పార్టీకి ఓటేయండి.. అంతా మంచి జ‌రుగుతుంది అంటున్నాడు‌. అయితే ఆది చేస్తున్న ప్ర‌చారం ఎంత వ‌ర‌కు ప‌నికొస్తుందో చూడాలి మరి.

CLICK HERE!! For the aha Latest Updates