‘సైరా’ నుండి ‘వీరారెడ్డి’ జగపతిబాబు లుక్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం నుంచి మరో లుక్‌ బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు జగపతిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయన వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయినట్లు కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, తమన్నా పాత్రలకు సంబంధించిన లుక్స్‌ బయటకు వచ్చాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్ట్‌ 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.