HomeTelugu Trendingఆ హీరోకు అన్నగా జగపతి బాబు

ఆ హీరోకు అన్నగా జగపతి బాబు

9 7
నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ డైరెక్షన్ లో ‘వీ’ అనే సినిమా లో చేస్తున్నడు. ఈ సినిమా తర్వాత ‘నిన్నుకోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ డైరెక్షన్‌ లో ‘టాక్ జగదీష్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన రీతువర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల సెంటిమెంట్ హైలెట్ గా నిలవనుందట. ఈ సినిమాలో నాని కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నారని తెలుస్తుంది. శివ నిర్వాణ చివరగా ‘మజిలీ’ సినిమా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా లవ్ సీన్లు అలరిస్తాయని తెలుస్తుంది. ఈ సినిమాలో నానికి జంటగా రీతు వర్మ నటిస్తోంది. మరదలి పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపిస్తుంది. ఇటు ప్రియురాలు అటు మరదలు మధ్య నాని సతమతమైపోతాడట. ఇప్పటి వరుకు విలన్‌, తండ్రి పాత్రలో మెప్పించిన జగపతిబాబు నాని కి అన్నగా ఎలా మెప్పిస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu