HomeTelugu Trendingవకీల్‌ సాబ్‌ భార్యగా శృతి హాసన్‌

వకీల్‌ సాబ్‌ భార్యగా శృతి హాసన్‌

Shruti hassan to play pawanపవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం వకీల్‌ సాబ్‌ సినిమాలో నటిస్తోన్నాడు. అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్’ హిందీ చిత్రాన్ని రీమేక్‌ ఈ సినిమా. ఈ సినిమాలో అమితాబ్‌ చేసిన పాత్రలో పవన్ కల్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు. వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరికొంత భాగం షూటింగ్ మిగిలివుంది.

ఇక శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నానంటూ కన్ఫర్మ్ చేసింది. ఆ పాత్ర గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మాత్రం మౌనం వహించింది. త్వరలోనే అన్నీ తెలుస్తాయని తెలిపింది. తాజా సమాచారం ప్రకారం శృతి పవన్ కల్యాణ్ కి భార్యగా ఆమె మరో పాత్రను పోషిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే పవన్‌, శృతి హాసన్‌ గబ్బర్ సింగ్, కాటమరాయుడుల్లో జంటగా నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu