HomeTelugu Trendingప్రభాస్ సలార్‌ మూవీపై జగ్గుభాయ్ కీలక వ్యాఖ్యలు

ప్రభాస్ సలార్‌ మూవీపై జగ్గుభాయ్ కీలక వ్యాఖ్యలు

Jagapathi Babu comments on
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ సలార్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి రోజుకో అంశం వైరల్‌ అవుతోంది.

సలార్ సినిమాపై తాజాగా జగపతి బాబు వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. సలార్‌ మూవీ మొదటి భాగంలో తనకు ప్రభాస్‌కు మధ్య ఒక్క సన్నివేశం కూడా లేదని చెప్పారు. సెకండ్ పార్ట్‌లో భారీ యాక్షన్ సీన్ ఉండొచ్చని అన్నారు.

జగ్గూభాయ్ వ్యాఖ్యలతో ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ మూవీలో మెయిన్ విలన్ రోల్‌ ఇంకెవరైనా చేస్తున్నారా అని చర్చలు జరుగుతున్నాయి. సలార్ సినిమా కథ కూడా వినకుండా ఓకే చెప్పినట్లు జగపతిబాబు గతంలో అన్నారు.

ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరని అన్నారు. ఆయన సినిమాలో అవకాశం రావడం ఆనందంగా ఉంది అని జగపతిబాబు అన్నారు. యాక్షన్ మూవీగా రానున్న ఈ చిత్రం కోసం తానుకూడా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

సలార్‌ టీజర్‌ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టించింది. ఇరవై నాలుగ్గంటల్లో 83 మిలియన్‌లకు పైగా వ్యూస్‌ను రాబట్టి ఇండియాలో హైయెస్ట్‌ వ్యూస్ వచ్చిన టీజర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఒక్క టీజర్‌తోనే యావత్‌ సినీ అభిమానుల్లో తిరుగులేని అంచనాలు క్రియేట్‌ చేసింది.

సలార్ మూవీ రెండు భాగాలుగా 5 బాషల్లో రూపొందుతోంది. ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్. జగపతిబాబు, శ్రియారెడ్డి, ఈశ్వరీరావు కీలక పాత్రలు చేస్తున్నారు. సెప్టెంబర్ 28న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu