HomeTelugu Trendingసొదరుడి డైరెక్షన్‌లో సోనాక్షి సిన్హా

సొదరుడి డైరెక్షన్‌లో సోనాక్షి సిన్హా

Sonakshi sinha new movie up
బాలీవుడ్ ప్రముఖ నటుడు శత్రఘ్న సిన్హా వారసురాలిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది నటి సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి తన కెరీర్‌‌లో ఇంత వరకు పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పటిదాకా నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రం చేయలేదామె. ఇప్పుడు తన కోరిక నిరవేరబోతుంది. ‘నికితా రాయ్ అండ్ ద బుక్ ఆఫ్ డార్క్‌నెస్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌ నిండా చీకటి అలముకుని ఉంది. మధ్యలో చిన్న వెలుతురు మాత్రం ఉంది. అందులో సోనాక్షి అటు తిరిగి కనిపిస్తోంది. పొడవాటి చెట్లు, వాటి మధ్యన ఓ వ్యక్తి నీడ కనిపిస్తున్నాయి. ఈ పోస్టర్‌‌, టైటిల్‌ని బట్టి ఇదో థ్రిల్లర్ మూవీ అనిపిస్తుంది. ఈ సినిమాకి సోనాక్షి సొదరుడు ఖుష్‌ దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. అతనికి ఇదే మొదటి సినిమా.

పరేష్ రావల్, సుహైల్ నయ్యర్ ఇతర పాత్రల్లో నటించనున్న ఈ చిత్రాన్ని ఎన్‌వీబీ ఫిల్మ్స్‌, నికితా పాయ్ ఫిల్మ్స్‌ సంస్థలతో కలిసి ఖుష్‌ నిర్మిస్తున్నాడు. ఇలాంటి చిత్రం కోసం తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని సోనాక్షి చెప్పింది. ఇన్నాళ్లకు తన కోరిక నెరవేరడంతో సంతోషంగా ఉందని తెలిపింది. తన సొదరి చాలా ప్రతిభావంతురాలన్న ఖుష్.. ఆమె సినిమాతో డైరెక్టర్‌‌గా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని ఖుష్ అంటున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu