HomeTelugu Big Stories100 మిలియన్ వ్యూస్ దాటిన మహేష్‌ 'మైండ్‌ బ్లాక్‌'

100 మిలియన్ వ్యూస్ దాటిన మహేష్‌ ‘మైండ్‌ బ్లాక్‌’

Mahesh babu mind block song
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు పాట కూడా ఒకటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. మహేష్‌ బాబు, రష్మిక హీరోహీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయాన్ని సాధించింది. ఇందులో పాటలు కూడా బాగుండడంతో మ్యూజికల్ హిట్ అని కూడా అనిపించుకుంది.

ముఖ్యంగా మహేశ్, రష్మిక జంటపై చిత్రీకరించిన ‘మైండ్ బ్లాక్..’ సాంగ్ అయితే సూపర్ హిట్టయింది. ఈ పాట సినిమాకే ఇది హైలైట్ సాంగ్ అయింది. గతేడాది ఫిబ్రవరి 29న యూ ట్యూబ్ లో రిలీజైన ఈ పాట తాజాగా 100 మిలియన్ వ్యూస్ ని దాటేసింది. శ్రీమణి రాసిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా రెనైనా రెడ్డి దీనిని ఆలపించడం జరిగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu