HomeTelugu Newsబాలకృష్ణకు మరోసారి అతనే విలన్!

బాలకృష్ణకు మరోసారి అతనే విలన్!

12 4సినిమాల్లో బాలకృష్ణకు సమఉజ్జీ అయిన విలన్‌ ఎవరంటే వెంటనే గుర్తిచ్చే పేరు జగపతిబాబు. బోయపాటి డైరెక్షన్లో రూపొందిన ‘లెజెండ్’ సినిమాలో బాలయ్య, జగబాబుల రైవలరీ సినిమాకే హైలెట్ అయింది. పోటీపోటీగా నటించిన ఈ ఇద్దరు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరి కాంబినేషన్ పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అందుకే కెఎస్ రవికుమార్ బాలయ్యతో చేయనున్న తన తరువాత సినిమాలో జగపతిబాబునే ప్రతినాయకుడిగా ఎంచుకున్నారు. ఈ నెల 17న లాంచ్ కానున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu