HomeTelugu Trendingజైలర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

జైలర్‌ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

jailer movie will stream on
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్. రూ.600 కోట్ల వసూళ్లతో జైలర్ చిత్రం బాక్సాఫీసును ఊపేసింది. తమ చిత్రం భారీ విజయం సాధించడంతో చిత్ర నిర్మాత కళానిధి మారన్… రజనీకి, దర్శకుడికి లగ్జరీ కార్లను బహూకరించడం తెలిసిందే.

తాజాగా జైలర్ ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబరు 7 నుంచి జైలర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. జైలర్ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న తలైవా అభిమానులకు, సినీ ప్రియులకు ఇది శుభవార్తే. ఈ సినిమాలో రమ్యకృష్ణ రజనీకాంత్‌కి జంటగా నటించగా.. తమన్నా కీలక పాత్రలో నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu