HomeTelugu Trending'జామ్ జామ్ జజ్జనక' సాంగ్ ప్రోమో

‘జామ్ జామ్ జజ్జనక’ సాంగ్ ప్రోమో

Jam Jam Jajjanaka Song Prom
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా నుండి వరుస అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘భోళా మ్యానియా’ సాంగ్ టీజర్ సోషల్మీడియాలో ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్పై ఓ కొత్త అప్డేట్ ను అఫీషియల్గా అనౌన్స్ చేశారు.

‘జామ్ జామ్ జజ్జనక’ పేరుతో ప్రోమోను రిలీజ్ చేశారు. అలాగే పూర్తి సాంగ్ జులై 11న వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రోమోలో చిరు.. ట్రెడిషనల్ వేర్లో స్టెప్పులు వేస్తూ అదిరిపోయారు. ఏదో వేడుకలో మరో యంగ్ హీరో సుశాంత్ తో కలిసి ‘జామ్ జామ్ జజ్జనక.. తెల్లారులు ఆడుతాం తైతక్కా’ అంటూ చిందులేస్తూ కనిపించారు. సాంగ్ టైటిల్ ప్రోమోలో వేసిన స్టెప్పు చూస్తుంటే.. ఫుల్ సాంగ్లో తన మార్క్ స్టైల్ డ్యాన్స్తో చిరు అదరగొట్టేసినట్లు అర్థమవుతోంది. సాంగ్ బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్ మ్యూజిక్ అదిరిపోయింది. మహతి స్వర సాగర్ ఈ పాటకు స్వరాలు అందించారు. ఇక ఈ మ్యూజికల్ ప్రోమోను చూసిన మెగా ఫ్యాన్స్.. మ్యూజిక్ వింటూ ఉగిపోతున్నారు. సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తనయుడు మహతి సాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మహానటి ఫేమ్ కీర్తిసురేశ్.. చిరంజీవికి చెల్లిలిగా కనిపిస్తోంది. రఘుబాబు రావు రమేష్ మురళీశర్మ రవిశంకర్ వెన్నెల కిషోర్ తులసి ప్రగతి శ్రీముఖి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన ‘వేదాళం’ మూవీకి రీమేక్గా తెరకెక్కుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu