HomeTelugu Newsతెలంగాణలో బీజేపీ-జనసేన సంయుక్త ప్రణాళిక

తెలంగాణలో బీజేపీ-జనసేన సంయుక్త ప్రణాళిక

11a

తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పనిచేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పటికే ఈ విషయంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడామని తెలిపారు. త్వరలోనే బీజేపీ ముఖ్యనేతలమంతా పవన్‌తో భేటీ కానున్నట్టు తెలిపారు. దేశంలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్ కల్యాణ్ సుముఖంగా ఉన్నారని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పవన్ సేవలు వినియోగించుకుంటామని, జనసేన-బీజేపీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో అవినీతిని రూపుమాపేందుకు కృషిచేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలనను అంతమొందించే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనేక అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. మెజారిటీ లేని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ దొడ్డిదారిన అధికారం దక్కించుకుందని విమర్శించారు. దీనిపై న్యాయ పోరాటం
చేస్తామని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu