కమెడియన్ కమ్ హీరోగారి కొత్త సినిమా!

టాలీవుడ్ లో కమెడియన్ గా సినిమాలు చేసి హీరోగా ఎదిగిన వారి లిస్ట్ చాలానే ఉంది. కానీ హీరోగా వారి సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి కూడా హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే మంచి కాన్సెప్ట్ ఉన్న కథలను ఎన్నుకుంటూ రాణిస్తున్నాడు. ఇటీవల ‘జయమ్ము నిశ్చజయమ్మురా’,’ఆనందో బ్రహ్మ’ వంటి చిత్రాలతో విజయం అందుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు హీరోగా మరో సినిమా చేస్తున్నాడు.

సుమంత్ అశ్విన్ తో ‘రైట్ రైట్’ అనే సినిమాను రూపొందించిన దర్శకుడు మను చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు శ్రీనివాస్ రెడ్డి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారు.