Homeతెలుగు Newsజనాసేనలో 60 శాతం కొత్తవారికే అవకాశం..!

జనాసేనలో 60 శాతం కొత్తవారికే అవకాశం..!

12 3
వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది జనసేన పార్టీ… వామపక్షాలు మినహా ఏ పార్టీతో పొత్తుఉండదని స్పష్టం చేసిన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోవైపు జిల్లాల వారీగా నేతలతో సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో కర్నూల్ జిల్లా నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన జనసేనాని… వచ్చే ఎన్నికల్లో 60 శాతం కొత్త వారికి, 20 శాతం భావజాలం ఉనం వారికి, 20 శాతం విలువలున్న నేతలకు టికెట్లు ఇస్తామని వెల్లడించారు. 2001 నుంచే ప్రజలు మార్పు కోరుతున్నారని గుర్తించా.. 2003 నుంచే పూర్తి స్థాయి రాజకీయాలకు సిద్ధమయ్యాయనని పార్టీ నేతలతో పంచుకున్న పవన్… సంక్రాంతిలోపు స్వల్ప కాలిక కమిటీలు వేస్తామని ప్రకటించారు.

కర్నూల్ జిల్లా కుటుంబాల మధ్య నలిగి పోతోందని.. యువత ఎదగాలని అనుకున్నా… రాజకీయ శక్తులు వారిని ఎదగనివ్వవని ఆవేదన వ్యక్తం చేశారు పవన్… ప్రస్తుత పార్టీలపై విసుగుతో ఉన్న ప్రజలు జనసేన వైపు చూస్తున్నారని.. అంతా కొత్త నాయకులు ఉంటే పార్టీ నిలబడదు, సీనియర్ల అవసరం కూడా పార్టీకి ఉందన్నారు. అయితే, ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలో స్పష్టత ఉందన్న జనసేనాని… కొత్త వారిలో కసి ఉంటుంది తప్ప వ్యూహం ఉండటంలేదన్నారు. ప్రజలు మనం ఏదో చేస్తామని ఆశగా ఉన్నారు.. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు నిలబడటమే కొన్నిసార్లు సమస్యగా మారుతోందని వెల్లడించారు. పోరాటం చేసే వారు కొంత సమయం ఓపికగా ఉంటే రాజకీయాల్లో నిలబడొచ్చని సూచించారు పవన్ కల్యాణ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu